CM Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినా.. నిరుద్యోగ సమస్య మాత్రం పోదని పేర్కొన్నారు. అదే సమయంలో ఏటా రాష్ట్రంలో లక్షలాది మంది పట్టభద్రులు బయటికి వస్తున్నారని.. అయితే అందులో వారికి ఉద్యోగానికి సరిపడా నైపుణ్యాలు ఉండటం లేదని తెలిపారు. ఇక త్వరలోనే 35 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.