నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి చట్టానికి సవరణ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీనిప గత సెప్టెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సురవరం పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.