Cockfights: ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందేలు, ఇతర పందేలు కోట్లల్లో సాగాయి. పండగ జరిగిన 3 రోజుల్లోనే ఏకంగా రూ.2 వేల కోట్ల పందేలు సాగినట్లు తెలుస్తోంది. అందులో చివరి రోజైన కనుమ నాడే రూ.1000 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఇక కోళ్ల పందేలు ఆడటమే కాదు.. చూడటం కోసం భారీగా జనం ఎగబడ్డారు. ఇక ఒక్క కోడి పందెమే ఏకంగా రూ.1.25 కోట్లు పలకడం.. అందరి కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఈ సంక్రాంతికి జరిగిన పందేల జాతరకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.