CPI Narayana: ప్రస్తుతం హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతలతో సీఎం రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు.