Deputy CM: ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖలో చాలా రోజులుగా ఉన్న ప్రమోషన్లు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం మోక్షం కలిగించనుంది. త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు చెప్పారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులలోని లోపాలను కాంగ్రెస్ పార్టీపైకి నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.