దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిబ్బంది అడ్డుకున్నారంటూ వస్తున్న ప్రచారంపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. దీనిపై టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాను ఎక్కడికీ పారిపోయే రకం కాదన్న అవినాష్.. తనకు అంత ఖర్మ పట్టలేదన్నారు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా పోరాడిన విషయం గుర్తు చేశారు. తన తండ్రి తనకు పుట్టుకతో పాటుగా ధైర్యాన్ని కూడా ఇచ్చారని.. కోర్టు తీర్పులు ఎలా ఉన్నాకూడా ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు.