బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి అర్ధరాత్రి ఆగంతకుడు చొరబడ్డాడు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి అర్ధరాత్రి వేళ ఆగంతకుడు ప్రవేశించాడు. లోపల మొత్తం కలియతిరిగాడు. ఈ విషయమై డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆగంతకుడు ఎవరా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అర్థరాత్రి వేళ ఎంపీ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడనే వార్త కలకలం రేపుతోంది.