డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే అధునాతన ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్‌లను ప్రవేశపెడుతున్నారు. ఈ ట్రాకులలో బండి నడిపి టెస్టు పాస్ కావటం అంత ఈజీ కాదని అధికారులు చెప్తున్నారు. విశాఖపట్నంలో ఈ ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్ విధానంలో డ్రైవింగ్ టెస్టుకు హాజరవుతున్న వారిలో సగం మంది ఫెయిల్ అవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. అసలేంటీ ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్ వ్యవస్థ.. ఎక్కడ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.