Duvvada vani about her husband Duvvada srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య, టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి మెట్టుదిగారు. భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించారు. తన కుమార్తె భవిష్యత్తు కోసం కలిసి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు సంబంధం లేదని.. సమాజం కోసం, కూతురి పెళ్లి కోసం కలిసి ఉందామంటూ ప్రపోజల్ పెట్టారు. అయితే దువ్వాడ వాణి ప్రతిపాదనను శ్రీనివాస్ తిరస్కరించారు. ఇంత జరిగిన తర్వాత కలిసి ఉండలేమని తేల్చిచెప్పారు.