divvala madhuri on Duvvada srinivas issue : వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గ నేత దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోని వివాదం మరో ట్విస్ట్ తిరిగింది. ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించిన దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై రెండేళ్లుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణల కారణంగా తన కుటుంబం దూరమైందన్న దివ్వల మాధురి.. ఇప్పుడు తానేం చేయాలని ప్రశ్నించారు. అందుకే దువ్వాడ శ్రీనివాస్‌తోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.