రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఒక సంస్థ హెచ్చరించడంతో తెలంగాణలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే.. ఈ సూచనను ప్రభుత్వ వర్గాలు లేదా శాస్త్రీయ సంస్థలు ధృవీకరించలేదు. భూకంపాలను ముందుగా అంచనా వేయడం శాస్త్రీయంగా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ స్వల్ప భూకంపాలు వచ్చినా పెద్దగా నష్టం జరగలేదు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిది.