దీపావళి పండుగ నేపథ్యంలో అనేక చోట్ల సంభవిస్తోన్న టపాసులు పేలుళ్లు, బాణాసంచా ప్రమాదాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కేంద్రంలో గురువారం ఓ దుర్ఘటన జరిగింది. తూర్పు వీధి గంగానమ్మ ఆలయం దగ్గర జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. బాణాసంచా విక్రయించడానికి సంచిలో తీసుకెళ్తుండా ఒక్కసారిగా అవి పేలిపోయాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది.