Fact Check: హైదరాబాద్‌లో హిందువుల ఇళ్లపై మూక దాడి జరిగింది అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో కొంత మంది వ్యక్తులు ఓ ఇంటిపై అంతస్తుకు ఎక్కడం, మరికొంత మంది భవనం గేటును ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోల్లో అసలు నిజం ఎంత? నిజంగానే తెలంగాణలోని హైదరాబాద్‌లోనే ఈ ఘటనలు జరిగాయా? తెలుసుకుందాం.