హైదరాబాద్‌లో నకిలీ నోట్లతో బంగారు వ్యాపారులను మోసం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారు వాట్సాప్ ద్వారా సంప్రదించి, నకిలీ నోట్ల కట్టలు ఇచ్చి బంగారం తీసుకునేవారు. ఇటీవల రూ. 60 లక్షల మోసానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఎవరైనా ఇంటికి వచ్చి బంగారం ఇస్తే డబ్బుల ఇస్తామంటే నమ్మవద్దని.. వెంటనే మమ్మల్ని సంప్రదించాలని పోలీసులు సూచించారు.