ఆంధ్రప్రదేశ్‌లో వరద సాయం అందనివారికి గుడ్ న్యూస్. బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం పరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అయితే ఏవైనా కారణాలతో బ్యాంకు ఖాతాల్లో వరద సాయం జమ కానివారికి నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సోమవారం విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బాధితులకు పరిహారం అందజేస్తారు. అనంతరం వరద సాయంలో భాగస్వామ్యులైన వారిని సత్కరించనున్న చంద్రబాబు.. వారితో ముచ్చటించనున్నారు. ఇక ఇప్పటి వరకూ రూ.569 కోట్లు వరద సాయం జమ చేశారు.