ఏపీలో మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో భేటీ అయిన ప్రతినిధులు.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఏర్పాటుకు వారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. మరోవైపు ఏపీలో ఫాక్స్‌కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మించాలని లోకేష్ కోరారు.