ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సు్ల్లో ఉచిత ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 12వ తేదీ రవాణాశాఖ, ఆర్టీసీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారని మంత్రి తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీ అమలుపైనా అదే రోజు చర్చిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమల్లోకి వస్తుందని మంత్రి వివరించారు. మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది.