ఖైరతాబాద్‌లోని 70 అడుగుల ఎత్తైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి కావడంతో గురువారం అలంకరించారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు 70 అడుగుల విగ్రహానికి అలంకరణ ఒకటిన్నర రోజుల్లో పూర్తి చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు శిల్పి రాజేంద్రన్ స్వామివారికి నేత్రాలంకరణ చేయగా... మహా గణపతి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను పూర్తిగా తొలగించారు.