నెల్లూరు జిల్లా టీపీగూడూరు మండలం అనంతపురంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాటర్‌బేస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.