తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ మొదలవుతోంది. ఓవైపు రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తర్వలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నారు. ఈ క్రమంలోనే.. జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.