Amrapali Warns Parking Violations: హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న మాల్స్, మల్టీప్లెక్స్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకుని.. మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు తేలిందన్నారు. కొన్ని చోట్ల ఫుడ్ స్టాళ్లలో అమ్ముతున్న తినుబండారాలు నాణ్యత లేవన్నారు.