తాజాగా నిర్వహించిన జీహెచ్ఎంసీ ప్యానెల్ మీటింగ్‌లు పలు కీలకాంశాలపై చర్చించారు. వీటిల్లో ముఖ్యమైనది పునరుద్ధరించిన బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు పేరు పెట్టాలని జీహెచ్ఎంసీ ప్యానెల్ ఆమోదించింది. ఎల్బీనగర్‌లో రోడ్డుకు వంగా మధుసూదన్ రెడ్డి పేరు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహం ఏర్పాటుకు కూడా సిఫార్సులు చేశారు. పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.