హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి త్వరలో పెరగనుంది. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి రేపు (ఆగస్టు 2) అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఆ తర్వాత వీటి విలీనానికి మార్గం సుగమం కానుంది.