kailasagiri Skywalk: సాగరతీరం విశాఖ సిగలో మరో మణిహారం చేరనుంది. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ అందుబాటులోకి రానుంది. ఏడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గాజు వంతెన త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వైజాగ్ గ్లాస్ స్కైవాక్ వీడియోను షేర్ చేశారు. ఇది చాలా అద్భుతమంటూనే.. చూడటానికి తనకు కుదరకపోవచ్చంటూ ట్వీట్ చేశారు.