వైఎస్ జగన్ ప్రజాదరణ కలిగిన నేత ..ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం ముప్పు ఉందన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.వైఎస్ జగన్‌కు మూడంచెల భద్రత అవసరమని.. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాదిగా అభిమానులు వస్తున్నారని.. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్‌గా కనిపించిందని.. హోంమంత్రి అనిత మాత్రం జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారన్నారు. ఆ 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారని.. హెలికాఫ్టర్‌ను ఇబ్బందులకు గురిచేసి మార్గమధ్యలో ఆయనపై దాడి చేయాలని కుట్ర పన్నారన్నారు. మంత్రి నారా లోకేష్‌కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తున్నారని.. వైఎస్ జగన్‌కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారన్నారు. జగన్‌కు పూర్తిస్థాయి రక్షణ బాధ్యత పోలీసులదే అన్నారు మాధవ్.