Gorantla Madhav: పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం

6 days ago 6
పోలీసులు, వారి అదుపులో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై దాడికి పాల్పడిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 24 వరకు నిందితులందరికీ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం పోలీసులు వారిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేసి పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని, నేరపూరితంగా పోలీసులపై దౌర్జన్యం చేశారని, దీనివెనక ఎవరున్నారనేది దర్యాప్తులో వెల్లడవుతుందని తెలిపారు. అయితే మీడియా ముందుకు ముసుగు ధరించి వచ్చేందుకు మాధవ్‌ నిరాకరించారు. ఎంపీగా చేసిన వ్యక్తిని మీడియా ముందు ఎలా పెడతారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమాషాలు చేయొద్దంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు ఆయన్ని మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. ఐదుగురు నిందితులను మాత్రమే మీడియాకు చూపించి అనంతరం వారితోపాటు మాధవ్‌ను గుంటూరులోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టుకు తరలించారు.
Read Entire Article