పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, పెద్దలు ససేమిరా అన్నారు. ఆ జిల్లాల్లోని ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి, తెనాలి మండలం అత్తోటకు చెందిన ప్రియాంకలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటనతో ఇరు కుటుంబాలు, గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.