ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జేసీగా ఐఏఎస్ అధికారి డి. హరితకు ఇచ్చిన పోస్టింగ్‌ను రద్దు చేసింది. ఈ మేరకు గతంలో జారీచేసిన పోస్టింగ్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎస్ నీరభ్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే హరితను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు హరిత మోస్ట్ కరప్టెడ్ ఐఏఎస్ అధికారి అంటూ ఇటీవల టీడీపీ సీనియర్ లీడర్ ఆనం వెంకటరమణ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఇచ్చిన పోస్టింగ్ వెనక్కి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.