ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. తాజాగా కార్యకలాపాలు విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయమై మంత్రి నారా లోకేష్‌ను హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులు కలిశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన హెచ్‌సీఎల్ 4500 మందికి ఉద్యోగాలు కల్పించింది. తాజాగా నూతన కార్యాలయం ప్రారంభించాలని హెచ్‌సీఎల్ భావిస్తోంది. కార్యకలాపాల విస్తరణ ద్వారా మరో 15000 ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.