Kancha Gachibowli: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)ను ఆనుకొని ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఇక్కడ ఉన్న 400 ఎకరాలను చదును చేయించి వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. జేసీబీలతో చదును చేయించే పనులు ప్రారంభించగా.. హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని నకిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..