High Court: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు సీజే.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలికి నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనలో ఆమ్రపాలితోపాటు పలువురు ఉన్నతాధికారులకు కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.