ఉద్యోగులు, విద్యార్థులు ఎగిరి గంతేసే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆగస్టులో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వస్తున్నాయని ఆ వార్త సందేశం. అయితే.. అందులో నాలుగు రోజులు సెలవులు ఉండగా.. మధ్యలో ఓ రోజు పర్సనల్‌గా తీసుకుని హాలిడే. మొత్తంగా 5 రోజుల లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అవకాశం ఉందన్నది కాన్సెప్ట్. ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి ఆగస్టు 19వ తేదీ వరకు 5 రోజుల పాటు సెలవులు ఎలా రానున్నాయంటే..?