ఆటో ప్రయాణంలో ఏర్పడిన పరిచయాన్ని అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లో జగదీష్ అనే ఆటో డ్రైవర్‌కు.. కన్నయ్య అనే ప్యాసింజర్ ఒక్కో ఖాతాకు రూ. 15,000 కమీషన్ ఆశ చూపాడు. దీనికి ఆకర్షితుడైన జగదీష్ తన స్నేహితులతో కలిసి వివిధ బ్యాంకుల్లో 117 ఖాతాలను తెరిపించి.. రాజస్థాన్ ముఠాకు అప్పగించాడు. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల సొమ్ము రూ. 24.10 కోట్లు జమ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేసి.. ఖాతాలు ఇచ్చిన 8 మందిని అరెస్టు చేశారు. కమీషన్లకు ఆశపడి బ్యాంక్ ఖాతాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు.