హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అన్నం పెట్టిన సంస్థకే సున్నం పెట్టిన ఓ వ్యక్తి ఏకంగా రూ.1.15 కోట్లు కొట్టేశాడు. ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థను మోసం చేసి కస్టమర్ల నుంచి డబ్బులు కాజేసి పరారయ్యాడు. సంస్థ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.