హైదరాబాద్ నగరవాసులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. ఆగస్టు 3 నుంచి 45 రోజుల పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కిషన్‌గూడ ర్యాంప్‌లోని విమానాశ్రయం నుంచి హైదరాబాద్ అప్రోచ్ రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.