హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం కావటం కలకలం రేపుతోంది. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వారు.. ఇప్పటికీ తిరిగిరాలేదు. ఫోన్లు చేసినా స్పందన లేదు. దీంతో బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల సాయంతో వారి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.