హైదరాబాద్‌లో ఉదయాన్నే విషాదకర ఘటన చోటుచేసుకుంది. హబ్సిగూడ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తార్నాక నుంచి హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌కు వెళ్లున్న ఓ ఆటో.. అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా బస్సు కిందికి దూసుకుపోయింది. దీంతో... ఆటోలోని డ్రైవర్‌తో పాటు పదో తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.