హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చుడీదార్ ధరించే విషయంలో భార్యతో గొడవ పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.