హైదరాబాద్ నగరంలో డీజేలు, ఫైర్ క్రాకర్స్‌పై నిషేదం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేలు నిషేదించాలని డయల్ 100కు ఎక్కువగా ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు, అన్ని మత పెద్దలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.