హైదరాబాద్‌లో గంజాయి దందాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ధూల్‌పేటలో మరో బడా స్మగ్లర్ పట్టుబడింది. ధూల్ పేట లేడీ డాన్‌గా చలామణి అవుతున్న సంధ్యాబాయి అనే.. మహిళా స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా గంజాయి అమ్ముతున్న సంధ్యభాయిని ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు.. పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సంధ్యబాయ్ నుంచి 2 కిలోల పైచిలుకు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా దందా నడిస్తోన్న సంధ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.