హైదరాబాద్ నగరంలో అతిపెద్ద అండర్‌పాస్ అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్కు సమీపంలో ఈ అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. దాదాపు 740 మీటర్లతో నిర్మిస్తున్న ఈ అండర్‌పాస్ నగరంలోనే అతిపెద్దది కానుంది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా.. ఈ అండర్‌పాస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు తీరిపోనున్నాయి.