హైదరాబాద్ కోకాపేట్ నియోపొలిస్ లేఅవుట్‌లో రూ.65 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ట్రంపెట్ జంక్షన్ సిద్ధమైంది. శంకర్‌పల్లి, మోకిల వంటి పరిసర ప్రాంతాల ప్రజలకు ORR అనుసంధానాన్ని ఈ ట్రంపెట్ జంక్షన్ సులభతరం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నాలుగు వరుసల జంక్షన్ 600 మీటర్ల పొడవు, సర్వీస్ రోడ్లతో కలిపి 1.3 కి.మీ విస్తరించి ఉంది. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి, విమానాశ్రయానికి 20 నిమిషాల్లో చేరే సౌలభ్యాన్ని అందిస్తుంది.