భారీ వర్షాలతో హైదరాబాద్ శివారు మోకిలలోని విల్లాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 210 విల్లాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీరు వచ్చింది. దీంతో కోటీశ్వరులు రోడ్డు మీద పడ్డారు. వరద ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలులేకపోవడంతోనే విల్లాల్లోకి నీరు చేరిందని అంటున్నారు.