HYD: పర్యాటక ప్రాంతంగా 58 ఎకరాల చర్లపల్లి చెరువు.. నిర్ణయం తీసుకున్న హైడ్రా..

8 months ago 24
హైడ్రా కమిషనర్ రంగనాథ్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆహ్వానంపై చర్లపల్లి చెరువును సందర్శించారు. 58 ఎకరాల ఈ జలవనరును పర్యాటక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ, జైళ్ల శాఖ అధికారులు కలిసి ఆధునీకరణపై చర్చించారు. చెరువు పరిశుభ్రత, జీవవైవిధ్యానికి అవకాశం ఉందని రంగనాథ్ ఆనందం వ్యక్తంచేశారు. ఫెన్సింగ్, కట్ట బలోపేతం, 3 కిలోమీటర్ల నడక దారి, మినీ పార్కులు, సీటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. డీపీఆర్ రూపొందించాలని సూచించారు.
Read Entire Article