సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు స్టే చేసిన పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లోని హోటల్ మెుదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. హోటల్ ఆరో అంతస్తులో ఉన్న టీం సభ్యులు వెంటనే ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫైర్ ఇంజన్ సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురాగా.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.