హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. తర్వలోనే ఫ్లైఓవర్ల కింద పార్కులు, గేమింగ్ జోన్లు, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్లైఓవర్ల కింద ఉన్న విశాలమైన స్థలాలను మల్టీపర్పస్‌గా ఉపయోగించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా షేక్‌పేట ఫ్లైఓవర్ కింద వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న అన్ని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.