హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బోయిన్ పల్లి పరిధిలో 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.8.5 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ డ్రగ్స్ కూల్‌డ్రింక్స్‌లో కలిపి అమ్మాయిలకు తెలియకుండా ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.