హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సాగర్ రింగు రోడ్డు సమీపంలోని ఓ ఆలయం వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న దంపతులు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 11కేవీ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఓ వీధి కుక్క కూడా మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.