హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో సిగ్నల్ ప్రాబ్లం కారణంగా ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతోంది. ఈ ఉదయం సూపర్ సేవర్ కార్డు రీఛార్జ్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి క్యూఆర్ కోడ్ మెషీన్లలో నో సిగ్నల్ అంటూ ఎర్రర్ వచ్చింది. దీంతో ప్రయాణికుల జేబుల్లో డబ్బులు కూడా లేకపోటంతో సూపర్ సేవర్ కార్డు ఉపయోగించుకునే వీలు లేకుండా పోయింది. రోజువారీ కార్డుతో ప్రయాణించటంతో జేబుకు చిల్లు పడింది.