హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తను ఓ మహిళ రెండో పెళ్లి పేరుతో ట్రాప్ చేసి కోట్లు కాజేసింది. తన తల్లితో కలిసి బెదిరింపులకు కూడా దిగింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో వ్యాపారులు, సినీ ప్రముఖులతో పరిచాయాలన్నాయంటూ నమ్మించి రూ.5.8 కోట్లకు పైగా కాజేసినట్లు తేలింది. కిలేడీకి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది.